ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పర్యటన పర్యటించారు. పెగడపల్లి మండలం ఆరవెల్లి, దోమలకుంట గ్రామాల్లో బీజేపీ జెండాను వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి బీజేపీలో చేరిన 30 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువా కప్పి అహ్వానించారు. ఆ తర్వాత పెగడపల్లి మండలంలో పలు మృతుల కుటుంబాలను వివేక్ వెంకటస్వామి పరామర్శించి.. నివాళులర్పించారు
ధర్మారం మండలం నందిమేడారం మాజీ సింగిల్ విండో చైర్మన్ పోనుగోటి నర్సింగావు తండ్రి కమలాకర్ వర్ధంతి సందర్భంగా.. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మారం మండల అధ్యక్షులు యాల్లా తిరుపతిరెడ్డిని వివేక్ వెంకటస్వామి పరామర్శించారు.