కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: వివేక్ వెంకటస్వామి

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: వివేక్ వెంకటస్వామి

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి  బీజేపీ కార్యకర్తలు తీసుకెళ్లాలని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు.  పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంయుక్త మోర్చా, సీనియర్ నాయకుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 

మోర్చాలు సమర్థవంతంగా పనిచేసి ప్రజల పక్షాన పోరాడుతూ బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలని వివేక్ వెంకటస్వామి అన్నారు. కరోనా సమయంల కేంద్ర ప్రభుత్వం దేశంలోని 80 కోట్ల మందికి 24 నెలల పాటు 10 కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని అందించిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఒక్కరికి 5 కిలోల బియ్యం ఇస్తే..రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్క కిలో కూడా ఇవ్వలేదన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి బీజేపీ  కార్యకర్తలు తీసుకెళ్లాలని కోరారు.