పెద్దపల్లి జిల్లాలో వివేక్​ వెంకటస్వామి పర్యటన

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్​ వివేక్ వెంకటస్వామి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలో నిర్వహిస్తున్న బోనాలు, పట్నాల వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిన్న ఓదాల గ్రామానికి చెందిన బీజేపీ లీడర్ ​చిట్టవేణి హరీశ్ ​తల్లి లక్ష్మి ఇటీవల చనిపోయారు. వారి కుటుంబాన్ని వివేక్​ పరామర్శించారు. ఎలిగేడు మండలం ధూలికట్ట గ్రామానికి చెందిన బాలసాని రామస్వామి ఇటీవల చనిపోగా వారి కొడుకులు కొమురయ్య, పరుశురాంలను పరామర్శించారు.

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో జరుగుతున్న బీరన్న పట్నాల్లో, పెద్దపల్లిలో పెద్దమ్మతల్లి బోనాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఎలిగేడులో ఇటీవల నిర్మించిన ఎల్లమ్మ తల్లి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో లీడర్లు గొట్టిముక్కుల సురేశ్​రెడ్డి, చంద్రుపట్ల సునీల్​రెడ్డి, కొండపాక సత్యప్రకాశ్‌, మల్లికార్జున్​, బోగోజు శ్రీనివాస్‌, రాపర్తి సంతోష్‌, తిరుపతి, అడ్డగుంట శ్రీనివాస్​, బాలసాని సతీశ్, ఉనుకొండ శ్రీధర్​, సదయ్యగౌడ్​, భూమయ్య, పార్వతి, జి.సంతోష్​, రాజబాబు పాల్గొన్నారు.