పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్ తండ్రి రావుల రాజయ్య అనారోగ్యంతో మృతి చెందారు.
ALSO READ : వందే భారత్ స్లీపర్ రైళ్లు..విమానం లెక్క ఉంది కదా..
ఈ సందర్భంగా రాజేందర్ కుటుంబ సభ్యులను వివేక్ వెంకటస్వామి పరామర్శించి.. వారికి దైర్యం చెప్పారు. రాజయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.