గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని గాంధీనగర్‌లో 40 డివిజన్ బీజేపీ కార్పొరేటర్ దుబాసి లలిత మల్లేష్ వదిన దుబాసి విజయ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మంగళవారం మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం విజయ భర్త లింగమూర్తి, కుటుంబ సభ్యులు దుబాసి లలిత, మల్లేశ్, నవ్య, రాజు, ధరణ్‌తో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా కల్పించారు. వారి వెంట బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ పి.మల్లికార్జున్, లీడర్లు బోయిని మల్లేష్ యాదవ్, సునీల్ కుమార్, పాకాల గోవర్ధన్ రెడ్డి, వెంకటేశ్, క్రాంతి, సాయి, జనగామ శివరామకృష్ణ, లక్ష్మి, నెరమట్ల విజయ, శాంతమ్మ, స్పందన తదితరులున్నారు.