నాంపల్లి మండలం దామెరలో వివేక్ వెంకటస్వామి ప్రచారం

నల్గొండ : సీఎం కేసీఆర్ అవినీతిలో మునిగిపోయారని మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. పరిపాలన తెలియని ముఖ్యమంత్రిపై మునుగోడు ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు. రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా నాంపల్లి మండలం దామెర గ్రామంలో వివేక్ వెంకటస్వామితో పాటు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ప్రచారం నిర్వహించారు. 

మోడీ పాలనలో యూపీలో 50 లక్షల ఇళ్లు నిర్మిస్తే తెలంగాణలో గత 8ఏండ్లలో 16 లక్షల ఇళ్లు కట్టే అవకాశమున్నా సీఎం పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు కట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్లు కట్టివ్వని కేసీఆర్.. తన కుటుంబం కోసం మాత్రం 100 ఎకరాల్లో ఫాంహౌస్ నిర్మించుకున్నారని ఆరోపించారు. కేంద్రం ఇళ్ల నిర్మాణం కోసం ఇస్తున్న నిధులను తుగ్లక్ ముఖ్యమంత్రి ప్రాజెక్టుల నిర్మాణానికి ఖర్చు చేస్తున్నడని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు.