కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు గంగలో కలిపిండు : వివేక్ వెంకటస్వామి

కాళేశ్వరం పేరుతో సీఎం కేసీఆర్  లక్ష కోట్లు గంగలో కలిపాడన్నారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. బంగారు తెలంగాణ పేరుతో తన కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడని ఫైరయ్యారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని నారాయణ పూర్ లో ఎన్నికల ప్రచారం చేశారు వివేక్. ఐటీ సోదాల పేరుతో నిన్నంతా హౌస్ అరెస్ట్ చేసి  ప్రచారం చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.   చెన్నూరులో బాల్క సుమన్ కు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.