మునుగోడులో దళిత మోర్చా నాయకులతో వివేక్ వెంకటస్వామి సమావేశం

నల్లగొండ : మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం కోసం పార్టీ నేతలు అలుపెరగకుండా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా నేతలు వివిధ సామాజిక వర్గ నాయకులతో భేటీయై  అభ్యర్థి విజయం కోసం వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఈ క్రమంలోనే మునుగోడులో నిర్వహించిన జిల్లా దళిత మోర్చా నాయకుల సమావేశానికి బీజేపీ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మునుగోడు బైపోల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

ఇదిలా ఉంటే ఎన్నికకు సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది. నేతలు ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. పనిలో పనిగా వివిధ సంఘాల నేతలతో భేటీయై రాజగోపాల్ రెడ్డి విజయం కోసం శ్రమించాలని పిలుపునిస్తున్నారు.