
చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీ. వివేక్ వెంకటస్వామి అన్ని గ్రామాల్లోనూ ప్రచారం చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వివేక్ వెంట నడుస్తూ.. హుషారుగా ప్రచారం చేస్తున్నారు.
ప్రచారంలో భాగంగా వివేక్ కు మద్దతు ఇస్తూ.. పలువురు మహిళలు డ్యాన్స్ చేశారు. వారి ఉత్సాహాన్ని చూసి, ఆనందంతో వివేక్ కూడా డ్యాన్స్ చేశారు. వారితో పాటు కాసేపు కదం కదిపారు. తన డ్యాన్స్ తో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో మరింత జోష్ నింపారు.
https://www.youtube.com/watch?v=ALTE2nn0bkc