కాకా స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు..: వివేక్​ వెంకటస్వామి

స్వర్గీయులు గడ్డం వెంకటస్వామి(కాకా) స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంటకస్వామి అన్నారు. ఆగస్టు 2న ఆయన పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. 

ఎవరికి ఏ ఆపద వచ్చినా కాకా ఫౌండేషన్​సాయం చేస్తుందని ఆయన అన్నారు. అనంతరం ధర్మారం మండలం కటికనపల్లి గ్రామంలోని ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధికి రూ.50వేల విరాళాన్ని అందించారు. 

ఇందుకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఓబీసీ మోర్చా కిశోర్​ఆధ్వర్యంలో 30 మంది బీజేపీలో జాయిన్​ అయ్యారు. వీరికి వివేక్​ వెంకటస్వామి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని మోదీ హయాంలో సైనికుడిలా పనిచేయాలని వారికి వివేక్​ సూచించారు.