వివేకా హత్య కేసులో నలుగురిపై కేసు.. అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదే కారణం..

వివేకా హత్య కేసులో నలుగురిపై కేసు.. అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదే కారణం..

2019 ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం రేపిన వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కస్టడీలో ఉన్నప్పుడు తనను హింసించారంటూ దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేశారు పులివెందుల పోలీసులు. కేసు నమోదైనవారిలో నిందితుడు శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి, జమ్మలమడుగు మాజీ డిఎస్పీ నాగరాజు, యర్రగుంట్ల మాజీ సీఐ ఈశ్వరయ్య, కడప మాజీ జైలు సూపరిండెంట్ ప్రకాష్ లు ఉన్నారు.

వివేకా హత్య కేసులో 2023 అక్టోబర్ నుండి 2024 ఫిబ్రవరి దాకా కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు దస్తగిరి. ఈ కేసులో వైసీపీ మద్దతుగా మాట్లాడాలని సీఐ ఈశ్వరయ్య, డిఎస్పీ నాగరాజు తనను బెదిరించంచారంటూ ఫిర్యాదు చేశాడు దస్తగిరి. అంతే కాకుండా 2023లో కడప జైల్లో సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని డాక్టర్ చైతన్య బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు దస్తగిరి.