దివంగత నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోస సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారటంతో రంగన్నను పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. రంగన్నను పరీక్షించిన వైద్యులు అతడిని కడప రిమ్స్ కు రిఫర్ చేసినట్లు సమాచారం.
2019 ఎన్నికలకు ముందు పులివెందుల నివాసంలో వైఎస్ వివేకా దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉన్న ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేయగా, పలువురు బెయిల్ పై ఉన్నారు.ఈ కేసులో కీలక నిందితుడు దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే.