వివేకానందను యువత స్పూర్తిగా తీసుకోవాలి

హైదరాబాద్ : భారత్ యువశక్తిగా ఎదుగుతోందన్నారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. 2030 వరకు ప్రపంచంలో భారత యువతే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ నారాయణగూడ కేశవమెమోరియల్ కాలేజ్ లో స్వామి వివేకానంద 158వ జయంతి వేడుకలను దత్తాత్రేయ ప్రారంభించారు. స్వామి వివేకానందను యువత స్పూర్తిగా తీసుకోవాలన్నారు. జీవితంలో ఎన్నికష్టాలు వచ్చిన గమ్యం చేరేవరకు ఆత్మవిశ్వాసం వీడొద్దన్నారు.