జాబ్ చెయ్యడానికి సిటీకెళ్లిన భర్త.. అమ్మాయిలతో సరసాలు, జల్సాలు.. చివరికి ఏమైంది..?

జాబ్ చెయ్యడానికి సిటీకెళ్లిన భర్త.. అమ్మాయిలతో సరసాలు, జల్సాలు.. చివరికి ఏమైంది..?
  • టైటిల్: వివేకానందన్ వైరల్,  
  • ప్లాట్ ఫాం : ఆహా
  • డైరెక్టర్:  కమల్
  • నటీనటులు:  షైన్ టామ్ చాకో, శ్వాసిక విజయ్, గ్రేస్ ఆంటోని, మెరీనా మైఖేల్, రమ్య సురేష్, మంజు పిళ్ళై, పార్వతీ మలా, నీనా కురుప్ 

వివేకానందన్ (షైన్ టామ్ చాకో) సిటీలో ఉద్యోగం చేస్తుంటాడు.  భార్య సితార (శ్వాసికా), తల్లి సొంతూరిలో ఉంటారు. అతను వారమంతా సిటీలో ఉంటాడు. వీకెండ్స్లో మాత్రమే ఊరికి వెళ్తుంటాడు. అతనికి సిటీలో మరో అమ్మాయి డయానా(గ్రేస్ ఆంటోనీ)తో వివాహేతర సంబంధం ఉంటుంది. 

ALSO READ | ఇదేం పిచ్చి అభిమానం.. హీరోపై అభిమానంతో రూ.72 కోట్లు ఆస్తులను రాసిన లేడీ ఫ్యాన్..

అంతేకాదు.. వివేకానందన్కు అమ్మాయిల పిచ్చి ఉండడంతో మరికొంత మంది ఆడవాళ్లను కూడా వేధిస్తుంటాడు. భార్య, ప్రేయసిని హింసిస్తుంటాడు. అతని బాధ తట్టుకోలేక డయాన తన ఫ్రెండ్ సాయంతో వివేకానందన్ భార్యని కలుస్తుంది. అప్పుడు అతని నిజస్వరూపం తెలుసుకున్న వాళ్లంతా అతనికి ఎలా బుద్ధి చెప్పారు? అనేది మిగతా కథ. ఈ సినిమా ప్రముఖ ఓటిటి ఆహాలో ప్రసారం అవుతోంది. మంచి కూల్ డ్రింక్, బిర్యానీతో సినిమా చూస్తూ సండే ఎంజాయ్ చెయ్యండి..