2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార వైసీపీ ఒకవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు నడుస్తున్న సమయంలో జగన్ సోదరి షర్మిల ఎంట్రీ ఇవ్వటంతో సీన్ మరింత ఉత్కంఠగా మారింది. ఈ ఎన్నికల్లో జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా వైసీపీ మీద ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అంతే కాకుండా వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
షర్మిలకు తోడు వివేకానంద రెడ్డి కూతురు సునీత, భార్య సౌభాగ్యమ్మ కూడా సీన్లోకి ఎంట్రీ ఇవ్వటంతో సీన్ మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే కడప పార్లమెంట్ బరిలో షర్మిల పోటీకి దిగగా, పులివెందులలో జగన్ పై పోటీకి వివేకానంద రెడ్డి భార్య సిద్దమైందన్న ప్రచారం మొదలైంది. సౌభాగ్యమ్మను ఎమ్మెల్యే అభ్యర్థిగా పులివెందుల బరిలో నిలిపేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మరి, రసవత్తరంగా మారిన కడప రాజకీయాల్లో ఓటరు ఎవరివైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.