వరల్డ్ కప్ లో బంగ్లా క్రికెటర్ ప్రమాదం నుంచి బయట పడ్డాడు. గ్రూప్ డి లో భాగంగా నెదర్లాండ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. నెదర్లాండ్ పేస్ బౌలర్ కింగ్ మా మూడో ఓవర్ లో ఐదో బంతిని షార్ట్ బాల్ వేశాడు. అప్పటికే తొలి నాలుగు బంతుల్లో 18 పరుగులు చేసి జోరు మీదున్న హసన్ పుల్ షాట్ ఆడదామని ప్రయత్నించాడు. అయితే షాట్ మిస్ అవ్వడంతో బంతి హెల్మెట్ గ్రిల్ లో ఇరుక్కుపోయింది.
దీంతో అతనికి కంకషన్ పరీక్ష చేసిన తర్వాత మళ్ళీ ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. గంటకు 133 కిలోమీటర్ల వేగంతో వేసిన ఈ బంతి గ్రిల్ లో ఇరుక్కుపోవడంతో ప్రమాదం చోటు చేసుకోలేదు. ఈ మ్యాచ్ లో హసన్ 26 బంతుల్లోనే 35 పరుగులు చేసి బంగ్లాకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అతని ఇన్నింగ్స్ లో 5 ఫోర్లతో పాటు ఒక సిక్సర్ ఉన్నాయి.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. షకీబ్ 46 బంతుల్లో 9 ఫోర్లతో 64 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ గట్టి పోటీనిస్తుంది. తొలి 8 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది.
Ouch! 🤕
— OneCricket (@OneCricketApp) June 13, 2024
The ball has stuck in the visor of the helmet of Tanzid Hasan.
📸: Disney+Hotstar#BANvsNED pic.twitter.com/c28pYMB3ee