టైటిల్ రైట్స్ డ్రీమ్11, అన్ అకాడమీకి ట్రాన్స్‌ఫర్?
న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ కంపెనీ ‘వివో’.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో ఉన్న బంధాన్ని తెంచుకునేందుకు రెడీ అయింది. అతి త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ కింద సీజన్‌కు రూ.440 కోట్లు చెల్లించే విధంగా వివో ఐదేళ్లు(2022 వరకు) కాంట్రాక్టు చేసుకుంది. ఇండియా–చైనా మధ్య సంబంధాలు దెబ్బతినడం వల్ల 2020 ఎడిషన్‌కు బీసీసీఐ.. వివోను సస్పెండ్ చేసింది. దాంతో డ్రీమ్ 11 ఆ ఎడిషన్‌కు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఇందుకోసం డ్రీమ్ 11 బోర్డుకు రూ.222 కోట్లు చెల్లించింది.మరోపక్క ఇరుదేశాల మధ్య ఇప్పటికీ అదే సిచ్యువేషన్ ఉండడంతో లీగ్‌తో కొనసాగడం కరెక్టు కాదని వివో భావిస్తోంది. దీంతో హక్కులను ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు డ్రీమ్ 11, అన్ అకాడమీ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. మరికొన్ని సంస్థలు కూడా ఐపీఎల్ రైట్స్ కోసం ఆసక్తి చూపిస్తున్నాయి. ఎవరికి రైట్స్ అప్పజెప్పాలన్నా బీసీసీఐ ఆమోదం మాత్రం తప్పనిసరి. కాగా, వివో తమ దగ్గరున్న రైట్స్‌ను ఎవరికి బదిలీ చేసినా బోర్డుకు చెల్లించాల్సిన డబ్బు తగ్గదని, కాస్త పెరిగే అవకాశం కూడా ఉందని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.
For More News..