
హైదరాబాద్, వెలుగు: తాజాగా మార్కెట్లోకి తీసుకొచ్చిన వీ40 సిరీస్ ఫోన్లలో క్వాలిటీ ఫొటోల కోసం జర్మనీ ఆప్టికల్ కంపెనీ జైస్తో ఒప్పందం కుదుర్చుకున్నామని స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో తెలిపింది. వివో తొలిసారిగా వివో ప్రో, నాన్ ప్రో వేరియంట్ల కోసం జైస్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫలితంగా ఈ ఫోన్లలో అధునాతన కెమెరా ఫీచర్లను అందించామని తెలిపింది.
అల్ట్రా-స్లిమ్ డిజైన్, బలమైన ప్రాసెసర్లు, అధునాతన ఏఐ సామర్థ్యాలతో వి 40 సిరీస్ ఫోన్లను లాంచ్చేసినట్టు తెలిపింది. వీటి ధరలు రూ.35 వేల నుంచి రూ.56 వేలకు ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ–-స్టోర్, అన్ని రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు.