
స్మార్ట్ఫోన్ మేకర్ వివో మనదేశ మార్కెట్లోకి టీ4ఎక్స్పేరుతో స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ 64 సర్టిఫికేషన్, ఐ ప్రొటెక్షన్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం. ఇందులో 6.72-అంగుళాల డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, ముందు 8-మెగాపిక్సెల్ కెమెరా, వెనుక 50 మెగాపిక్సెల్ + 2-మెగాపిక్సెల్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 15 ఓఎస్ ఉంటాయి. 6జీబీ + 128జీబీ ఆప్షన్ ధర రూ.13,999 కాగా, 8జీబీ + 128జీబీ ధర రూ.14,999. ఇక 8జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ. 16,999 అని వివో తెలిపింది.