వివో ఎక్స్​90 ఫోన్లు లాంచ్​

స్మార్ట్​ఫోన్​ బ్రాండ్‌ వివో ఇండియా మార్కెట్లోకి వివో ఎక్స్ 90 ప్రో, ఎక్స్​90 ఫోన్లను తీసుకొచ్చింది. వివో ఎక్స్ 90 ప్రో ధర రూ.85 వేలు కాగా, ఎక్స్​90 ధర 60 వేల నుంచి మొదలవుతుంది. వివో ఎక్స్ 90 ప్రోలో 6.78-అంగుళాల డిస్​ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్, ముందు 32 -మెగాపిక్సెల్ కెమెరా, వెనుక 50 -మెగాపిక్సెల్ + 50-మెగా పిక్సెల్ + 12-మెగా పిక్సెల్  కెమెరాలు,​8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ, 4,870 ఎంఏహెచ్ ​బ్యాటరీ ఉంటాయి.  

వివో ఎక్స్​90లో 6.78-అంగుళాల డిస్​ప్లే, మీడియాటెక్ ప్రాసెసర్, ముందు 32 -మెగా పిక్సెల్ కెమెరా వెనుక 50-మెగా పిక్సెల్ + 12-మెగాపిక్సెల్ + 12-మెగాపిక్సెల్ కెమెరాలు, 8జీబీ ర్యామ్,  128 జీబీ స్టోరేజీ, 4810ఎంఏహెచ్ ​బ్యాటరీ ఉంటాయి. వచ్చే నెల 5 నుంచి ప్రీ బుకింగ్స్​ మొదలవుతాయి.