వివో బడ్జెట్​ స్మార్ట్ ఫోన్​.. వై19ఈ.. ధర మరీ ఇంత తక్కువనా..?

వివో బడ్జెట్​ స్మార్ట్ ఫోన్​.. వై19ఈ.. ధర మరీ ఇంత తక్కువనా..?

చైనీస్ స్మార్ట్‌‌‌‌ఫోన్ బ్రాండ్ వివో తన తాజా బడ్జెట్- ఫ్రెండ్లీ స్మార్ట్‌‌‌‌ఫోన్ వివో వై19ఈని భారతదేశంలో విడుదల చేసింది. ఇందులో యూనిసాక్ టీ7225 ప్రాసెసర్,  5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీబీ ర్యామ్​ + 64జీబీ స్టోరేజ్,  6.74-అంగుళాల డిస్​ప్లే, 13ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్,  5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ధర రూ.7,999. వివో ఇండియా ఈ–-స్టోర్, ఫ్లిప్‌‌‌‌కార్ట్,  రిటైల్ స్టోర్‌‌‌‌లలో ఇది అందుబాటులో ఉంటుంది.