vivo Y29 5G వచ్చేసింది..కెమెరా ఫీచర్స్అదిరిపోయాయ్

vivo Y29 5G వచ్చేసింది..కెమెరా ఫీచర్స్అదిరిపోయాయ్

vivo Y సిరీస్లో కొత్త స్మార్ట్ఫోన్ vivo Y29 5G ఇండియాలో లాంచ్ అయింది.Vivo Y29 5G 120Hz రిఫ్రెష్ రేట్,1,000 nits బ్రైట్‌నెస్‌తో 6.64-అంగుళాల LCD డిస్‌ప్లే ఉంటుంది. ఇది MediaTek డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 8GB RAM తోపాటు మరో 8GB పొడిగించిన RAM పొడిగించుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ లో  256GB స్టోరేజీ వరకు పొడిగించుకోవచ్చు.

vivo Y29 5G స్మా్ర్ట్ ఫోన్ కెమెరా ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. ఫొటోగ్రఫీకోసం ఈ డివైజ్ లో AI నైట్ మోడ్ ఉన్న 50MP బ్యాక్ కెమెరా ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది.ఈ డివైజ్ లో AI ఫొటో ఎన్ హెన్సింగ్, AI ఎరేస్, ఫ్లాష్ వంటి అనేక కెమెరా ఫీచర్లు ఉన్నాయి. 

ఈ స్మార్ట్ ఫోన్ మూడు  రంగుల్లో అందుబాటులో ఉంది. దీంతో పాటు 5500mAH, 44W ఫ్లాష్ ఛార్జ్ తో ఎక్కువ కాలం వచ్చే బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. 
మన్నిక పరంగా vivo Y29 5G స్మార్ట్ ఫోన్ మిలిటరీ గ్రేడ్ రెసిస్టెన్స్ , SGS సర్టిఫికేషన్‌తో పాటు డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కోసం IP64 రేటింగ్‌తో రూపొందించబడింది.

vivo Y29 5G ధర : 

  • 4GB + 128GB కన్ఫిగరేషన్ తో ధర రూ.13,999
  • 6GB + 128GB కన్ఫిగరేషన్ తో ధర రూ.15,499
  • 8GB + 128GB కన్ఫిగరేషన్ తో ధర రూ.16,999
  • 8GB + 256GB కన్ఫిగరేషన్ తో ధర రూ.18,999

దీంతోపాటు కస్టమర్లు బ్యాంక్ ఆఫర్లు ద్వారా 1500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. SBI కార్డ్, IDFC ఫస్ట్ బ్యాంక్ ,yes బ్యాంకులతో లోకాస్ట్ EMI ఎంపికలను ఎంచుకోవచ్చు.