వీడి దుర్మార్గానికి సరైందే : చిన్న పాపను రేప్ చేసినోడికి.. పాతికేళ్ల జైలు

వీడి దుర్మార్గానికి సరైందే : చిన్న పాపను రేప్ చేసినోడికి.. పాతికేళ్ల జైలు

బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ మానవ మృగానికి 25ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది విశాఖపట్నం పోక్సో కోర్టు. 2022 జులై 7న నమోదైన ఈ కేసు విషయంలో శుక్రవారం ( డిసెంబర్ 6, 2024 ) ఈ మేరకు తీర్పునిచ్చింది కోర్టు. మైనర్ బాలికను చాలాసార్లు చేసినందుకు గాను త్రినాథ్ అనే వ్యక్తికి 25ఏళ్ళ జైలు శిక్షతో పాటు రూ. 1 లక్ష 25వేల రూపాయలు జరిమానా విధించింది కోర్టు. ఈ కేసుకు సంబందించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.

విశాఖపట్నం సాయినగర్ కాలానికి చెందిన త్రినాథ్ అనే వ్యక్తి భర్త కోల్పోయిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆమెకు అప్పటికే ఒక కుమార్తె ఉంది. తండ్రి స్థానంలో ఉన్న త్రినాథ్ మైనర్ బాలికను అల్లారు ముద్దుగా చేసుకోవాల్సింది పోయి, వావి, వరస మరచి పశువులా ప్రవర్తించాడు. మైనర్ బాలికపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం గురించి ఎవరికీ చెప్పొద్దని బెదిరించడంతో సైలెంట్ గా ఉండిపోయింది బాలిక. 

ALSO READ : మీరు మనుషులేనా : ప్రతి 10 నిమిషాలకు.. ఓ మహిళ లేదా బాలికను చంపేస్తున్నారు..!

అయితే.. కొంతకాలం తర్వాత సెలవుల కోసం అమ్మమ్మ ఇంటికి వెళ్లిన బాలిక.. అక్కడ తనపై జరిగిన అత్యాచారం గురించి లెటర్ రాసి ఉంచింది. కొన్నాళ్ల తర్వాత బాలిక అమ్మమ ఆ లెటర్ ను చూసి.. కుటుంబసభ్యులకు చెప్పటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక రాసిన లెటర్ చదివి షాక్ కి గురైన కుటుంబసభ్యులు అనకాపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. త్రినాథ్ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత సుదీర్ఘ విచారణ తర్వాత త్రినాథ్ కు 25ఏళ్ళ జైలు శిక్ష విధించింది కోర్టు.