దిగొచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం.. విధుల్లోకి కాంట్రాక్ట్ కార్మికులు..

దిగొచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం.. విధుల్లోకి కాంట్రాక్ట్ కార్మికులు..

కాంట్రాక్టు కార్మికులను విధుల నుంచి తొలగిస్తూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 4వేల 200మంది కాంట్రాక్టు కార్మికులు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ గత కొద్దిరోజులుగా కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న ఉద్యమం ఫలించింది.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగొచ్చింది.కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు అంగీకారం తెలిపింది యాజమాన్యం.

ALSO READ | వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్తత...భారీగా పోలీస్ బలగాల మోహరింపు..

తొలగించిన 4,200 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి తీసుకుంటామని.. వారం రోజుల్లో బయోమెట్రిక్ విధానం పునరుద్ధరిస్తామని తెలిపింది యాజమాన్యం. ఈ మేరకు లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య ఒప్పందం జరిగింది. ఎట్టకేలకు  వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగి రావటంతో  ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు కాంట్రాక్టు కార్మికులు.