వైజాగ్ స్టీల్​కు రూ. 1,650 కోట్లు ఇచ్చిన కేంద్రం 

వైజాగ్ స్టీల్​కు రూ. 1,650 కోట్లు ఇచ్చిన కేంద్రం 

న్యూఢిల్లీ : ప్రభుత్వ యాజమాన్యంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్​ఐఎన్​ఎల్)/వైజాగ్​స్టీల్​లో​ ప్రభుత్వం దాదాపు రూ. 1,650 కోట్లు పెట్టుబడి పెట్టింది.  ఈ ఏడాది సెప్టెంబర్ 19న ఈక్విటీ రూపంలో రూ. 500 కోట్లు,  సెప్టెంబర్ 27న రూ. 1,140 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోన్‌‌‌‌‌‌‌‌ను అందించింది.  తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆర్​ఐఎన్​ఎల్ పరిస్థితిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తి అనుబంధ సంస్థ అయిన ఎస్​బీఐక్యాప్స్​ ఒక నివేదికను సిద్ధం చేస్తోందని కూడా మంత్రిత్వశాఖ పేర్కొంది.  

ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్​ఐఎన్​ఎల్​కు ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని విశాఖపట్నంలో 7.5 మిలియన్ టన్నుల ప్లాంట్‌‌‌‌‌‌‌‌ ఉంది. సంస్థ తీవ్రమైన ఆర్థిక,  కార్యాచరణ సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.