సాధారణంగా వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీ ముగిసిన తర్వాత అన్ని జట్లకు కొన్ని రోజుల పాటు రెస్ట్ దొరుకుతుంది. కానీ భారత్-ఆస్ట్రేలియా జట్లకు కనీసం నాలుగు రోజుల సమయం లేకుండా టీ 20 సిరీస్ ని నిర్వహించారు. షెడ్యూల్ లో భాగంగా భారత పర్యటనలో ఆస్ట్రేలియా టెస్టు, వన్డే, టీ 20 సిరీస్ ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లు టెస్టు, వన్డే సిరీస్ ఆడేయగా.. టీ 20 సిరీస్ మాత్రం వరల్డ్ కప్ తర్వాత జరగనుంది. షెడ్యూల్ ఇదివరకే ప్రకటించగా వీటిలో మొదటి టీ 20 వైజాగ్ స్టేడియంలో నిర్వహించనున్నారు.
ఈ మీటింగ్ కి సంబంధించి ఇండియా-ఆస్ట్రేలియా ఆర్గనైజింగ్ కమిటీ మొదటి సమావేశం స్టేడియంలో జరిగింది. మంగళవారం ఇక్కడ సమావేశం అనంతరం ఏసీఏ (ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్) సెక్రటరీ ఎస్‌ఆర్ గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ఫూల్‌ప్రూఫ్ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
“గతంలో జరిగిన మ్యాచ్‌లు స్టేడియంలో విజయవంతంగా నిర్వహించబడినందున BCCI హై ప్రొఫైల్ ఇండియా మరియు ఆస్ట్రేలియా మ్యాచ్‌ను కేటాయించింది. వైజాగ్‌కు మరిన్ని మ్యాచ్‌లు కేటాయించడానికి బీసీసీఐ సిద్ధంగా ఉన్నందున మేము వైజాగ్ స్టేడియం ట్రాక్ రికార్డ్‌ను నిర్వహిస్తాము. అని తెలిపారు.
కాగా.. ఈ టూర్ లో ఇండియా-ఆస్ట్రేలియా మొత్తం 5 టీ 20 లు ఆడాల్సి ఉంది. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 3 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. మొదటి టీ 20 వైజాగ్ లో జరగనుండగా.. తిరువనంతపురం, గౌహతి,నాగ్ పూర్, హైదరాబాద్ లో వరుసగా నాలుగు టీ 20 మ్యాచులు జరుగుతాయి.