వైజాగ్ వైసీపీకి భారీ షాక్ : జనసేనలోకి కార్పొరేటర్లు

వైజాగ్ వైసీపీకి భారీ షాక్ : జనసేనలోకి కార్పొరేటర్లు

విశాఖ  సిటీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వైసీపీకి విశాఖలో మరో షాక్ తగిలింది. ఊహించినట్లుగానే ఆ పార్టీ నుంచి కార్పొరేటర్లు ఒక్కరొక్కరుగా చేజారిపోతున్నారు. ఈ నెల 19న విశాఖ మేయర్​ పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా ...  గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డి మంత్రి మనోహర్​ సమక్షంలో జనసేనలో చేరారు.    గోపాలపట్నం మండలం వైసీపీ నేత  బెహరా భాస్కర్ భార్య, కోడలు కూడా వైసీపీ  కార్పొరేటర్లు గా కొనసాగుతున్నారు. వీరుకూడా వంశీరెడ్డితో పాటు జనసేన కండువా కప్పుకున్నారు. దీంతో విశాఖ కార్పొరేషన్​ లో కూటమి బలం మరింత పెరిగింది.

►ALSO READ | తిరుపతిలో ఉద్రిక్తత: భూమన హౌస్ అరెస్ట్.. గోశాలకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు..