
విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద నిన్న (అక్టోబర్ 29) జరిగిన రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. మరో 50మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు లోకో పైలట్లు, గార్డు మృతిచెందారు.ఇప్పటివరకు 13 మంది మృతదేహాలను సహాయ బృందాలు వెలికితీశాయి.వారిలో విశాఖ- రాయగడ ప్యాసిం జర్ లోని ఇద్దరు లోకోపైలట్లు, పలాస ప్యాసింజర గార్డు ఎంఎస్ రావు ఉన్నారు. మృతదేహాలను విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గురైన బోగీలను ట్రాక్ పై నుంచి తొలగించి అక్కడి నుంచి తలిస్తున్నారు. ప్రమాద ఘటనపై అధికాులు దర్యాప్తు చేపట్టారు.
ALSO READ : రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కేంద్రం, ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా..