ఉక్రెయిన్తో యుద్దంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. గత కొంతకాలంగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నట్లు గురువారం (సెప్టెంబర్ 5) ప్రకటించారు.ఉక్రెయిన్తో చర్చలకు సిద్దమని..భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు మధ్యవర్తులుగా సమస్యకు పరిస్కారం దొరుకుతుందని నమ్ముతున్నామన్నారు పుతిన్.
ఓ రష్యన్ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ ఉక్రెయిన్తో యుద్దం ముగింపుపై మాట్లాడారు.. ‘‘మేం మా స్నేహ దేశాలు, వారి భాగస్వామ్యాలను గౌరవిస్తాం.. ఉక్రెయిన్ సంఘర్షణకు సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించడానికి మా మిత్ర దేశాలు చైనా, బ్రెజిల్, భారత్ లు ప్రయత్నిస్తాయని నమ్ముతున్నాను. వారితో నిరంతరం టచ్ లో ఉన్నాను’’. అని పుతిన్ చెప్పారు.
ALSO READ | ట్రంప్ పుస్తకానికి మస్త్ గిరాకీ.. అమెజాన్ బెస్ట్ సెల్లర్‌గా సేవ్ అమెరికా
ఇదే విషయాన్ని రష్యా అధ్యక్ష అధికార ప్రతినిధి డిమిత్రి కూడా స్పష్టం చేశారు. ఉక్రెయిన్పై చర్చను ఏర్పాటు చేయడంతో భారత్ సహాయం చేయగలదని నమ్మ కం వ్యక్తం చేశారు.
ఆగస్టు 23న ఉక్రెయిన్లో పర్యటించిన మోదీ.. ఉక్రెయిన్, రష్యా యుద్దాన్ని ముగించేందుకు కాలయాపన చేయకుండా చర్చలకు వెళ్లాలని, ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్దరించేందుకు కీలకంగా వ్యవహరించేందుకు భారత్ సిద్దంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని మోదీ చెప్పారు.