
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చనిపోతాడు.. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోతోంది అని జోస్యం చెప్పారు. మార్చి 26న ఓ యూరోపియన్ జర్నలిస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్ల నేపథ్యంలో జెలెన్ స్కీ వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. రష్యా,ఉక్రెయిన్ కొనసాగుతున్న సంక్షోభం, ఎనర్జీ ఇన్ ఫ్రాస్టక్చర్ పై దాడులు క్రమంలో US మధ్యవర్తిత్వంలో పాక్షికంగా కాల్పుల విరమణకు అంగీకరించిన మరుసటి రోజే జెలెన్ స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read : అమెరికా ఎన్నికల ప్రాసెస్ మొత్తం మార్చేస్తా
పుతిన్ తాను చనిపోయే వరకు అధికారంలో కొనసాగాలని ఆశిస్తున్నాడు. అతని లక్ష్యం ఒక ఉక్రెయిన్ మాత్రమే కాదు..పశ్చిమ దేశాలతో ప్రత్యక్ష ఘర్షణకు దారితీయవచ్చని జెలెన్ స్కీ అన్నారు. అమెరికా,యూరప్ ఐక్యంగా ఉండి పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని zelensky కోరారు. యూరోపియన్- అమెరికన్ కూటమికి భయపడి రష్యా నాయకుడు దానిని విభజించాలని చూస్తున్నాడని జెలెన్ స్కీ ఆరోపించారు. మరోవైపు పుతిన్ తన మరణం గురించి భయపడుతున్నాడని చెప్పారు. పుతిన్ త్వరలో చనిపోతాడు.. అది వాస్తవం.. పుతిన్ మరణంతో ప్రస్తుత సంక్షోభానికి తెరపడుతుందని జెలెన్ స్కీ అన్నారు.
మరోవైపు యుద్ధంలో US సహాయానికి కృతజ్ఞతలు తెలిపాడు జెలెన్ స్కీ. అమెరికాను రష్యా తనవైపు తిప్పుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఇలాంటి వాటిని మేం సహిచం..పోరాడుతాం.. మాకు వేరే మార్గం లేదు అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పష్టం చేశారు.