చండూరు, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె 35వ చేరుకుంది. ఆదివారం నల్గొండ జిల్లా చండూరు, మర్రిగూడలో కబడ్డీ ఆడి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
కార్యక్రమంలో వీవోఏల మండల అధ్యక్షుడు పడసబోయిన యాదగిరి, సరికొండ లింగయ్య, దొంతగోని శశికళ, సుగుణ, అరుణ, అరుణ, పుష్ప కుమారి పాల్గొన్నారు.