
- ఏఎఫ్‌ఆర్సీకి చైర్మన్ లేకపోవడమే కారణం
- ఎలక్షన్ కోడ్,ప్రభుత్వపరంగా స్తబ్దుగా ఉండటంతోనూ ఇబ్బంది
- 30 శాతం మేర ఫీజులుపెంచాలని కాలేజీల డిమాండ్
- వృత్తి విద్యా కాలేజీల్లో ప్రస్తుతమున్న ఫీజులే వచ్చేవిద్యా సంవత్సరంలోనూ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎస్‌ఏఎఫ్‌ఆర్సీ) చైర్మన్ పోస్టును రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ భర్తీ చేయలేదని, అంటే ఫీజుల్లో మార్పులు జరగకపోవచ్చని విద్యాశాఖవర్గాలు పేర్కొంటున్నాయి. వివిధ కోర్సు లకు మే,జూన్ నెలల్లో ప్రవేశపరీక్షలు జరిగి, అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ఆలోగానే ఫీజుల సవరణపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫీజులనుబట్టే విద్యార్థులు కాలేజీలను ఎంపిక చేసుకోవడానికి వీలుంటుంది. ప్రస్తుతం మే చివరివరకు ఎలక్షన్కోడ్ అమల్లో ఉండటం, ప్రభుత్వపరంగా అంతా స్తబ్దుగా ఉండటంతో ఏఎఫ్ఆర్సీ చైర్మన్ నియామకం,ఫీజుల సవరణ జరిగే అవకాశం తక్కువని అంటున్నారు. అడ్మిషన్ల తర్వాత ఫీజులు పెంచితే.. విద్యార్థులపై భారం పడే అవకాశం ఉంటుందని, అలా పెంచకపోవచ్చని చెబుతున్నారు.
ఈసారి మార్చాలి..
రాష్ట్రంలోని బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ,ఎల్‌ఎల్‌బీ, బీఈడీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ.. తదితర16 వృత్తి విద్యా కోర్సుల ఫీజులను ఏఎఫ్‌ఆర్సీనిర్ణయిస్తుంది. మూడేళ్లకోసారి కాలేజీల నుం చిఆదాయ వ్యయాల వివరాలను తీసుకుని, తర్వాతి మూడేళ్లకు సంబంధించిన ఫీజులను ఖరారుచేస్తుంది. 2016–17, 2017–18, 2018–19విద్యా సంవత్సరాలకు సంబంధిం చి 2016 లోనేఫీజులను ఖరారు చేసింది. ఇప్పుడా ఫీజుల గడువుముగిసింది. ఇప్పుడు 2019–20, 2020–21,2021–22 విద్యా సంవత్సరాలకు సంబంధిం చినఫీజులను నిర్ణయించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇప్పటికే.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వృత్తివిద్యా కాలేజీల నుంచి ఆదాయ,వ్యయాల వివరాలను, ఫీజుల సవరణ కోసం దరఖాస్తులను స్వీకరించింది. వాటిని ఏఎఫ్ ఆర్సీపరిశీలించి, కాలేజీల వారీగా ఫీజులను ఖరారుచేయాల్సి ఉంటుంది. ఈ మూడేళ్లకు కొత్త ఫీజులకోసం 1,240 వరకు ప్రైవేటు కాలేజీలు దరఖాస్తుచేసుకున్నాయి. సుమారు 350 కాలేజీలు ప్రస్తుతఫీజులే చాలన్న ఉద్దేశంతో, ఈసారి దరఖాస్తు చేసుకోలేదు.
చైర్మన్ లేక..
ఏఎఫ్‌ఆర్సీ చైర్మన్ పదవీకాలం గతేడాదిముగిసింది. ఆ స్థానంలో కొత్తవారిని నియమించాల్సి ఉంది. అయితే ఇంకా ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఇప్పటికే అన్ని వృత్తివిద్యా కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి ప్రవేశపరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే,జూన్ నెలలో పరీక్షలు, అడ్మిషన్లు కూడా జరగనున్నాయి. సాధారణంగా అయితే ఆలోగానే కాలేజీలు, కోర్సుల వారీగా ఫీజులను నిర్ణయించాలి. కాలేజీల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఏఎఫ్ ఆర్సీ చైర్మన్ సమక్షంలోనే పరిశీలించాల్సి ఉంటుంది. ఆపోస్టు ఖాళీగా ఉండటంతో ఫీజుల సవరణ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. మే నెలాఖరు వరకూ లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఏఎఫ్ఆర్సీ చైర్మన్ నియామకం కష్టమేనని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఈసీ అనుమతి తీసుకుని భర్తీ చేసుకునే అవకాశం ఉందన్నారు. కానీ ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నాలేవీ చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రస్తుతమున్న ఫీజులనే కొనగించాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాలేజీల యాజమాన్యాలు మాత్రం కనీసం 30శాతం మేర ఫీజులను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.