
ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్త ప్లాన్ ను తీసుకొచ్చినట్లు తెలిపింది టెలికాం సంస్థ వొడాఫోన్. ఏడాదికి ఒకేసారి రీచార్జి చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిందని బుధవారం ప్రకటించింది. కొత్త ప్లాన్‌ను ఇవాళ ప్రవేశపెట్టింది. రూ.1999కి ప్లాన్ లభిస్తుంది. ఇందులో వినియోగదారులకు రోజుకు 1.5 GB డేటా, 100 SMSలు లభిస్తాయి. అన్ లిమిటెడ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించారు.