న్యూఢిల్లీ: యూకేకు చెందిన వొడాఫోన్ గ్రూపు వొడాఫోన్ఐడియా షేర్ల ద్వారా సేకరించిన రూ.11,650 కోట్లతో అప్పులను తీర్చేసింది. ఇందుకోసం వొడాఫోన్ఐడియా లిమిటెడ్(వీఐఎల్)లోని తన వాటాను మొత్తం తనఖా పెట్టింది. శుక్రవారం వొడాఫోన్ఐడియా షేర్ల ముగింపు ధర రూ.7.41తో లెక్కిస్తే మొత్తం షేర్ల విలువ రూ.11,649 కోట్లుగా లెక్కించారు.
వీఐఎల్లో వొడాఫోన్ గ్రూపునకు 22.56 శాతం, ఆదిత్య బిర్లా గ్రూపునకు 14.76 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 23.15 శాతం వాటాలు ఉన్నాయి.