ఐడియా ప్లాన్ అదిరింది : డైలీ 2 GB డేటా.. ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు..!

ఐడియా ప్లాన్ అదిరింది : డైలీ 2 GB డేటా.. ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు..!

ఐడియా, జియో, ఎయిర్ టెల్ వంటి అన్ని నెట్ వర్క్ సంస్థలు తమ  రీచార్జ్ ప్లాన్ల ధరలు పెంచిన విషయం తెలిసిందే.. కస్టమర్లనుంచి నెగెటివ్ టాక్ రావడంతో ఆ టెలికం ఆపరేటర్లు కస్టమర్లను బుజ్జగించేందు కొత్త రీచార్జ్ ప్లాన్లను తీసుకొస్తున్నాయి. అంతేకాకుండా కస్టమర్లు రీచార్జ్ ధరలు పెంచిన నెట్ వర్క్ లను వదిలి పెట్టి బీఎస్ ఎన్ ఎల్ వైపు చూస్తున్నట్లు కూడా ప్రచారంసాగుతోంది. ఈ క్రమంలో ఆయా కంపెనీలు కొత్త కొత్త రీచార్జ్ ఆఫర్ల ను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే వొడాఫోన్ ఐడియా కొత్త రీచార్జ్ ప్లాన్ ను ఆఫర్ చేస్తుంది. రూ. 365 లతో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 2GB డేటాతో పాటు మరిన్ని బెనిఫిట్స్ ను అందిస్తుంది. ఇప్పుడు ఐడియా ప్రక టించిన ఆఫర్ తో ఇతర నెట్ వర్క్ ఆఫర్లను పోల్చి చూద్దాం.. ఏదీ కస్టమర్లకు లాభాదాయకంగా ఉంటుందో తెలుసుకుందాం.. 

వొడాఫోన్ ఐడియా కూడా ఇటీవల తన రీచార్జ్ ఫ్లాన్లలో మార్పులు చేసింది. దీంతో పాటు కొత్త రీచార్జ్ ఫ్లాన్లను కూడా ఆఫర్ చేసింది. అందులో ఒకటి రూ. 365 రీచార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

వొడాఫోన్ ఐడియా కొత్తగా తీసుకొచ్చిన రీచార్జ్ ప్లాన్ రూ. 365. ఇది రోజుకు 2GB డేటాను అందిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ను అందిస్తుంది. రోజుకు 100 ఎస్ ఎంఎస్ లు కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రాత్రి 12 గంటలనుంచి ఉదయం 6 గంటలకు వాడుకొనే డేటాను రోజువారీ డేటానుంచి కాకుండా ఫ్రీగా ఇస్తుంది. అంతేకాకు ఈ ప్లాన్ తో వీకెండ్ 2GB డేటా రోలోవర్  ఆఫర్ చేస్తుంది. 

దీంతోపాటు మరో సరసమైన రీచార్జ్ ప్లాన్ ను కూడా కొత్త గా తీసుకొచ్చింది. అదే రూ. 95 రీచార్జ్ ప్లాన్. ఈ కొత్త ప్లాన్ డేటా, OTT బెనిఫిట్స్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా 4GB డేటాను 28 రోజులు వ్యాలిడిటీతో అందిస్తుంది. OTT స్ట్రీమింగ్ ను ఆస్వాదించే వారికి ఈ ప్లాన్ తో సోని లైవ్ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది.