తగ్గుతున్న కస్టమర్ల బేస్, ఆర్పూ
ఇంకా విస్తరించని 4 జీ నెట్ వర్క్
వెలుగు, బిజినెస్‌డెస్క్: ఏజీఆర్ బకాయిలను చెల్లించడానికి పదేళ్ల టైమ్ ఉన్నప్పటికీ వొడాఫోన్ ఐడియా తిరిగి నిలబడుతుందా? సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, కంపెనీ చెల్లించాల్సిన మొత్తం ఏజీఆర్ బకాయిలు రూ. 50,400 కోట్లలో 10 శాతాన్ని అడ్వాన్స్‌గా వొడాఫోన్ ఐడియా కట్టాల్సి ఉంది. మిగిలిన మొత్తాన్ని 10 ఏళ్లలో చెల్లించాలి. కానీ 8 శాతం వడ్డీ రేటు వద్ద కంపెనీ ఏడాదికి సుమారుగా రూ. 7,500 కోట్లను ఏజీఆర్ బకాయిల కోసం ఖర్చు చేయాలి. ఇంత మొత్తంలో బకాయిలు కట్టాలంటే కంపెనీ ప్రమోటర్లు అదనంగా డబ్బులను ఇన్వెస్ట్ చేయడం, టారిఫ్‌లను పెంచడం వంటివి చేయకపోతే తప్ప వొడాఫోన్ ఐడియా రేస్‌లో నిలబడడం కష్టం. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌తో పోల్చుకుంటే వొడాఫోన్ ఐడియా బ్యాలెన్స్ షీట్ అధ్వాన్నంగా ఉంది. జూన్ క్వార్టర్‌కి గాను కంపెనీ రూ. 25,460 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఇలాంటి పరిస్థితులలో మార్కెట్‌లో పోటీ ఇవ్వాలంటే కంపెనీ తన యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్(ఆర్పూ) ను రూ. 150–175 కు పెంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా ఆర్పూ రూ. 114 గా ఉంది. ఇది రిలయన్స్ జియో ఆర్పూ రూ. 130.60, ఎయిర్‌టెల్ ఆర్పూ రూ. 157 కంటే చాలా తక్కువ. కస్టమర్ల బేస్ తగ్గుతుండడంతో కంపెనీ ఆర్పూ కూడా పడిపోతోంది. ఇప్పటికీ కంపెనీ తన 4జీ టెక్నాలజీని పెద్దగా విస్తరించలేదు. దీంతో వొడాఫోన్ ఐడియా కస్టమర్లు ఇతర టెలికాం నెట్‌వర్క్‌లకు మారుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో కంపెనీ ఏకంగా 2.2 కోట్ల మంది కస్టమర్లను కోల్పోయింది. ఇది తనకున్న మొత్తం కస్టమర్ బేస్‌లో 7 శాతానికి సమానం. జూన్ క్వార్టర్ నాటికి వొడాఫోన్ ఐడియా కస్టమర్ బేస్ 27.98 కోట్లకు పడిపోయింది. ఇది మార్చి క్వార్టర్‌లో 29.1 కోట్లుగా ఉంది. కంపెనీ 4 జీ యూజర్లు కూడా 10.56 కోట్ల నుంచి 10.46 కోట్లకు తగ్గారు. దీంతో కంపెనీ ఆర్పూ జూన్‌తో ముగిసిన క్వార్టర్‌లో రూ. 121 నుంచి రూ. 114 కు పడిపోయింది.
వేగంగా డబ్బుల సమీకరణ..
మార్కెట్లో నిలబడాలంటే వొడాఫోన్ ఐడియా వీలున్నంత తొందరగా 3–4 బిలియన్ డాలర్లను సమీకరించాలని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రమోటర్లు అదనంగా ఇన్వెస్ట్ చేయడం, రైట్స్ ఇష్యూ, కంపెనీ ఫైబర్, డేటా సెంటర్లను అమ్మేయడం ద్వారా నిధులను సమీకరించడం అవసరమని చెబుతున్నారు. ‘ఏజీఆర్ బకాయిలు ఎంత చెల్లించాలి, ఎప్పటిలో చెల్లించాలో ఓ స్పష్టత వచ్చింది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా భారీగా నిధులను సమీకరించాలి. కంపెనీ లాంగ్ టెర్మ్ బాండ్స్, ప్రమోటర్లు అదనంగా ఇన్వెస్ట్ చేయడం వంటి మార్గాల ద్వారా నిధులను సమీకరించొచ్చు’ అని ఎస్‌బీఐ క్యాప్స్ సెక్యూరిటీస్ పేర్కొంది. ప్రస్తుతం రూ. 6,585 కోట్లను వొడాఫోన్ గ్రూప్ వొడాఫోన్ ఐడియాలో ఇన్వెస్ట్ చేస్తుందనే అంచనాలున్నాయి.
ఈ నెల 4 న వొడాఫోన్, ఐడియా బోర్డ్ మీటింగ్ ..
నిధుల సమీకరణ గురిం చి చర్చించేం దుకు ఈ నెల 4 వ తేదిన కంపెనీ బోర్డ్ సమావేశం కానుందని వొడాఫోన్ ఐడియా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. పబ్లిక్ ఇష్యూ, ప్రిపరెన్షియల్ అలోట్‌మెంట్, ప్రైవేట్ ప్లేస్‌మెంట్ వంటి మార్గాలను కంపెనీ ఎంచుకోనుంది. వీటితో పాటు క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషన్స్ ప్లేస్‌మెంట్, ఈక్విటీ షేర్లను, సెక్యూరిటీలను ఇష్యూ చేయడం ద్వారా నిధులను సమీకరించాలని వొడాఫోన్ ఐడియా చూస్తోంది. ఫారిన్ కన్వర్ట్‌బుల్ బాండ్స్, లిస్ట్ అయిన లేదా లిస్ట్ కాని అన్ని రకాల డిబెంచర్లను ఇష్యూ చేయడం
ద్వారా నిధులను సమీకరించనుంది.
For More News..