- 61 శాతం డి స్కౌంట్తో..
- ఒక్కో షేరు రూ.12.50 కు జారీ
- మొత్తంగా రూ.25వేల కోట్ల నిధులు సేకరణ
న్యూ ఢిల్లీ: దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా రూ.25వేల కోట్ల రైట్స్ ఇష్యూలో భాగంగా ఒక్కో ఈక్వి టీ షేరును రూ.12.50కు జారీ చేయనున్నట్టు ప్రకటించింది. బుధవారం సమావేశమైన బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఈ మేరకు ఆమోదించారు. మార్కెట్ రేటుకు ఇది 61 శాతం డిస్కౌంట్. రికార్డు తేదీ 2019 ఏప్రిల్ 2 నాటికి అర్హులైన షేర్ హోల్డర్స్ కు ప్రతి 38 ఈక్వి టీ షేర్లకు 87 ఈక్విటీ షేర్లు వస్తాయని రెగ్యు లేటరీ ఫైలింగ్ లో కంపెనీ తెలిపింది. ఈ రైట్స్ ఇష్యూ 2019 ఏప్రిల్ 10 నుంచి ప్రారంభమవుతుండగా.. 2019 ఏప్రిల్ 24తో ముగుస్తుందని కంపెనీ పేర్కొంది. ‘రూ.12.5కు మొత్తంగా 2వేల కోట్ల కొత్త షేర్లను జారీ చేయనున్నాం. ఒక్కో ఈక్విటీ షేరును రూ.12.50కు జారీ చేయనున్నాం. దీనిలోనే రూ.2.50 ప్రీమియం కూడా కలిసి ఉంటుంది. ముగింపు ధర రూ.32కు ఇది 61 శాతం డిస్కౌంట్’అని కంపెనీ తెలిపింది. అర్హులైన ప్రస్తుత ఈక్విటీ షేర్ హోల్డర్లకు రైట్స్ ఇష్యూ జారీ చేయడం ద్వారా రూ.25వేల కోట్లను సేకరించే ప్రణాళికకు ఈ ఏడాది ప్రారంభంలోనే వొడాఫోన్ ఐడియా బోర్డు డైరెక్టర్లు ఆమోదించారు.
ఎఫ్ డీఐ ఇన్ ఫ్యూజన్ కు కూడా ఈ కంపెనీకి కేబినెట్ నుంచి అనుమతి లభించింది. ఈ రైట్స్ ఇష్యూలో భాగంగా వొడాఫోన్ గ్రూప్ ప్రమోటర్లు రూ.11వేల కోట్ల వరకు, ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రమోటర్లు రూ.7,250 కోట్ల వరకు కంపెనీలోకి చొప్పిస్తున్నారు. ఒకవేళ రైట్స్ ఇష్యూ అండర్ సబ్ స ్క్రైబ్ అయితే నిబంధనల మేరకు ప్రతి ప్రమోటర్ షేర్ హోల్డర్స్ అన్ స బ్ స్క్రైబ్ అయిన దానిలో కొంతభాగాన్ని లేదా పూర్తిగా సబ్ స్క్రైబ్ చేసుకుంటామని కూడా తెలిపారు. ఈ రైట్స్ ఇష్యూ ద్వారా సేకరించిన మొత్తాన్ని , రుణాలను 20.2 శాతం తగ్గించు కోవడానికి, జియో నుంచి వస్తోన్న పోటీని తట్టుకోవడానికి ఉపయోగించనున్నారు.
రుణాలను తగ్గిం చడానికి ప్రమోటర్లు ఈ విధంగా నిధులు చొప్పించడం ఇది రెండోసారి. రైట్స్ ఇష్యూ షేరు ధరను నిర్ణయించిన నేపథ్యం లో వొడాఫోన్ ఐడియా షేర్లు 3 శాతానికి పైగా పెరిగాయి. వొడాఫోన్ ఐడియాలో బ్రిటీష్ కు చెందిన వొడాఫోన్ కు 45.1 శాతం, కుమార్ మంగళం బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్ కు 26 శాతం, ఐడియా షేర్ హోల్డర్స్ కు 28.9 శాతం వాటాలున్నాయి. రిలయన్స్ జియో టెలికాం మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని నెలలకే వొడాఫోన్, ఐడియాలు విలీనమై, దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించాయి.