హుజూరాబాద్, వెలుగు: అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ అని, తమ పాలనలో దేశంతోపాటు రాష్ట్రం అన్ని రంగాల్లో డెవలప్ అయిందని కాంగ్రెస్ అభ్యర్థి వొడితల ప్రణవ్ పేర్కొన్నారు. మంగళవారం హుజూరాబాద్‌లోని పార్టీ ఆఫీస్ నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామన్నారు.
హుజూరాబాద్‌లో తన గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. పదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రూ.400కే గ్యాస్ సిలిండర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రూ.వేయికోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటున్న కౌశిక్‌రెడ్డి.. ఇన్ని రోజులు ఎవరు ఆపారని ప్రశ్నించారు. పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఓడిపోతున్నామని తెలిసే కౌశిక్ రెడ్డి కొత్తగా మాట్లాడుతున్నాడని విమర్శించారు.