హామీల అమలులో  ప్రభుత్వాలు ఫెయిల్​

హుజూరాబాద్, వెలుగు:  బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు దొందు దొందేనని, హామీలను నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిలయ్యాయని  హుజూరాబాద్ ​కాంగ్రెస్ అభ్యర్థి వొడితల ప్రణవ్ విమర్శించారు.  శనివారం హుజూరాబాద్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  

ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్యారంటీలను పక్కాగా అమలుచేస్తామన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గంలో డిజిటల్ లైబ్రరీలతోపాటు స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా రాంపూర్ గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన లీడర్లు బండారి సదానందం, రామచంద్రం, రాజేందర్, సురేందర్‌‌‌‌‌‌‌‌, ఎల్లయ్య, కరుణ, కవిత రమేశ్‌‌‌‌, స్వరూప చొక్కారెడ్డి కాంగ్రెస్‌‌‌‌లో చేరారు.