జమ్మికుంట, వెలుగు: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాచాటాలని ఆ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. వీణవంక మండలం కిష్టంపేట గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు గడపగడపకు తీసుకువెళ్లాలని సూచించారు. పార్టీలకతీతంగా కష్టాల్లో ఉన్న ప్రతిఒక్కరికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాహెబ్ హుస్సేన్, పీసీసీ మెంబర్ కర్ర భగవన్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు రమాదేవి, రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు.