
కోహెడ, వెలుగు: రాబోయే పార్లమెంట్ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న బోయినపల్లి వినోద్‌కుమార్ ను గెలిపించేందుకు కార్యకర్తలు కష్టపడి పని చేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లడారు.
ఎమ్మెల్యే ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ పార్లమెంట్ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, ఎంపీపీ కీర్తి, నాయకులు పేర్యాల దేవేందర్‌రావు, లక్ష్మణ్, శ్రీకాంత్, రాజిరెడ్డి, అబ్దుల్‌ఖాదిర్, శంకర్ఉన్నారు.
Also Read : సాహిత్య అకాడమీ పోటీలకు యూసుఫ్ పేట వాసి