టెక్నాలజీ : ఏఐతో ఫోన్​కాల్​కు​ రిప్లయ్ ఇయ్యొచ్చు..​అదేంటో తెలుసుకోండి!

టెక్నాలజీ : ఏఐతో ఫోన్​కాల్​కు​ రిప్లయ్ ఇయ్యొచ్చు..​అదేంటో తెలుసుకోండి!

ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే కాల్ లిఫ్ట్ చేయడం కొన్నిసార్లు కుదరకపోవచ్చు. కానీ, ఏమాత్రం డిలే కాకుండా వెంటనే అవతలి వాళ్లకు రిప్లయ్ ఇచ్చేలా చాట్​బాట్​లాంటి ఫీచర్ ఏదైనా ఉంటే భలే ఉంటుంది కదూ! ఇలా ఆలోచించే వాళ్ల కోసమే ఆండ్రాయిడ్​12 ​యూజర్లకు కాల్​ స్క్రీనింగ్​ ఫీచర్​ అందుబాటులోకి తీసుకురావాలని గూగుల్ ఆలోచిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​ సాయంతో పనిచేసే ఇది కాలర్​కు స్మార్ట్​ రిప్లయ్​ ఇవ్వడానికి వీలు కల్పిస్తుంది.

దీన్ని ఎనేబుల్ చేసుకుంటే యూజర్లు కాల్​ను పికప్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎంచుకున్న ఆడియో రిప్లయ్​లతో గూగుల్ అసిస్టెంట్ అవతలివాళ్లకు ఆన్సర్ ఇస్తుంది. ఇందుకోసం గూగుల్ అసిస్టెంట్​కు ముందుగానే ఎవరు, ఎందుకు కాల్ చేస్తున్నారో చెప్పాల్సి ఉంటుంది.

వివరంగా చెప్పాలంటే.. ఎవరైనా అపాయింట్​మెంట్ కోసం కాల్ చేస్తుంటే.. అప్పుడు యూజర్ అప్పటికే సజెస్ట్ చేసిన కన్ఫర్మ్​ లేదా క్యాన్సిల్ అని రిప్లయ్ ఇస్తుంది. కొత్త కాల్ స్క్రీనింగ్​ ఫీచర్​ దీన్ని మరింత ఈజీ చేయనుంది. ఇది కాల్ చేసేవాళ్ల అవసరాలను బట్టి ఏఐ సాయంతో తగిన రిప్లయ్ ఇస్తుంది.  ​