Lay offs:వోక్స్ వ్యాగన్ ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం?

Lay offs:వోక్స్ వ్యాగన్ ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం?

ప్రముఖ కార్ల కంపెనీ వోక్స్ వ్యాగన్ ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉద్యోగులను కలిగివున్న వోక్స్ వ్యాగన్.. ఇటీవ ల కంపెనీ వర్క్ ఫోర్స్ ను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా కొంత మంది ఉద్యోగులకు తొలగింపు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

చైనాలో వోక్స్ వ్యాగన్ కార్ల అమ్మకాలు తగ్గడం, కంపెనీ నిర్వహణ ఖర్చు తగ్గించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మారుతున్న ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ కు అనుగుణంగా వోక్స్ వ్యాగన్ తన వర్క్ ఫోర్స్ ను తగ్గించుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంలో ఉద్యోగ కోతలు ఉండొచ్చు. 

తాజా నివేదికల ప్రకారం.. చైనాలో వోక్స్ వ్యాగన్  అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. దీంతో కంపెనీ నిర్వహణ ఖర్చు తగ్గించుకునేందుకు ఉద్యోగాల తొలగింపు చేయాలని నిర్ణయించింది. రాబోయే మూడేళ్లలో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. 

వోక్స్ వ్యాగన్ AG చైనాలని కార్పొరేట్ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. ఆగస్టులో చైనాలో వోక్స్ వ్యాగన్ లాభాలు గణనీయంగా తగ్గాయి. స్థానిక కంపెనీలు గట్టిపోటీ ఇస్తుండటంతో మొదటి త్రైమాసికంలో 7.4 శాతం అమ్మకాలు పడిపోయాయి. 2019తో పోలిస్తే ఇది 24 శాతం తగ్గాయి. 2026 నాటికి ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ఉద్యోగుల కోత ఉంటుంది.

చైనాలో వోక్స్ వ్యాగన్ ఉద్యోగులు మొత్తం 90వేల మంది ఉన్నారు. ఇందులో చాలామంది జాయింట్ వెంచర్ లో పనిచేస్తున్నారు. కొంతమంది ఉద్యోగులను ఈ వారం లో తొలగించారు. కొంతమంది విదేశీ ఉద్యోగులను జర్మనీకి తిరిగి పంపారు. రాబోయే మూడేళ్లలో మిగతావారిపై ఈ లేఆఫ్స్ ప్రభావం తీవ్రంగా ఉంటున్నట్లు తెలు స్తోంది.