12 వేల కోట్ల ట్యాక్స్‌‌ నోటీసులపై కోర్టుకు ఫోక్స్‌‌‌‌వ్యాగన్‌‌‌‌

12 వేల కోట్ల ట్యాక్స్‌‌ నోటీసులపై కోర్టుకు ఫోక్స్‌‌‌‌వ్యాగన్‌‌‌‌

న్యూఢిల్లీ: ప్రభుత్వం పంపిన సుమారు రూ.12 వేల కోట్ల (1.4 బిలియన్ డాలర్ల) ట్యాక్స్ నోటీసులపై ఫోక్స్‌‌‌‌‌‌‌‌వ్యాగన్ కోర్టుకెళ్లింది.  ఫోక్స్‌‌‌‌‌‌‌‌వ్యాగన్ గ్రూప్ కంపెనీలు స్కోడా ఆటో, ఫోక్స్‌‌‌‌‌‌‌‌వ్యాగన్‌‌‌‌‌‌‌‌ ఇండియా, ఆడి ఇండియాలు  తమ  కారు పార్ట్‌‌‌‌‌‌‌‌లను  ఒక్కో పార్టుగా దిగుమతి చేసుకున్నాయని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.  కారు మొత్తాన్ని  దిగుమతి చేసుకున్నాయని,   కానీ    కంప్లిట్లీ నాక్డ్‌‌‌‌‌‌‌‌ డౌన్ యూనిట్స్‌‌‌‌‌‌‌‌ (పార్టులను దిగుమతి చేసుకొని ఇక్కడి అసెంబుల్ చేయడం) పై పడే 30–35 శాతం ట్యాక్స్‌‌‌‌‌‌‌‌కు బదులు సపరేట్ పార్టులపై వేసే 5–15 శాతం కస్టమ్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ పడిందని తెలిపారు. దీనిపై కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ట్యాక్స్ నోటీసులను ఫోక్స్‌‌‌‌‌‌‌‌వ్యాగన్‌‌‌‌‌‌‌‌కు పంపారు. 

కానీ, తమ స్ట్రాటజీకి 2011 లో ప్రభుత్వం మద్ధతిచ్చిందని, రూల్స్‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టే దిగుమతులు జరిపామని కంపెనీ ముంబై హైకోర్టులో సవాలు విసిరింది. ప్రభుత్వం ఆలోచనలకు విరుద్ధంగా ఇవి ఉన్నాయని, ఇలా చేస్తే ఫారిన్ ఇన్వెస్టర్లకు ఇండియాపై నమ్మకం పోతుందని ఫోక్స్‌‌‌‌‌‌‌‌వ్యాగన్ తన పిటీషన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. రూల్స్‌‌ను ఉల్లంఘించలేదని తెలిపింది.  ట్యాక్స్ గొడవ వలన ఇండియాలో స్కోడా ఇన్వెస్ట్ చేయాలనుకున్న రూ.13 వేల కోట్ల (1.5 బిలియన్ డాలర్ల) పెట్టుబడుల ప్లాన్‌‌కు బ్రేక్ పడే అవకాశముంది.