చౌటి గూడెంలో వాలీబాల్ పోటీలు

ములకలపల్లి, వెలుగు :  శివరాత్రి, మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండలంలోని చౌటిగూడెంలో అడ్వోకేట్, ఆదివాసి సేన నాయకులు ఉకె రవి ఆధ్వర్యంలో వాలీబాల్, ముగ్గుల పోటీలు నిర్వహించారు. వాలీబాల్​ టోర్నమెంట్​ను మాజీ ట్రైకర్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. 

గ్రామస్థాయి నుంచి దేశ స్థాయికి ఎదిగి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. మారుమూల గ్రామాలలో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో చౌటుగూడెం మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు, బైటి రాజేశ్, వాడే నాగరాజు, గ్రామ పెద్దలు మీడియం నాగేశ్, వరస భీముడు, కురసం ముత్యాలు, గడ్డం బాబురావు, తానం కృష్ణ, భాస్కర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.