హైదరాబాద్, వెలుగు : త్వరగా అత్యవసర సేవలను అందించేందుకు హైదరాబాద్ బేస్డ్ రైడ్ -హెయిలింగ్ యాప్ వోల్టా, టోటల్ ఎమర్జెన్సీ నెట్‌వర్క్ (టెన్)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. డ్రైవర్ల నుంచి ఎలాంటి కమీషన్ లేకుండా రైడ్‌లను అందిస్తామని వోల్టా ప్రకటించింది.
ఈ సంస్థ యాప్‌లోని ఎస్ఓఎస్బటన్ను నొక్కితే 15 నిమిషాల్లోనే అంబులెన్స్ సేవలు అందుబాటులోకి వస్తాయి. హైదరాబాద్‌తోపాటు ఆరు మెట్రో నగరాల్లో ఈ యాప్ పనిచేస్తుంది. టెన్ సర్వీసెస్ ఎండీ కిషోర్ బాబు మాట్లాడుతూ 650 అంబులెన్స్‌లతో 4,500 మందికి పైగా ప్రాణాలను కాపాడమన్నారు.