రైతులను ముంచి, కార్పొరేట్లకు మేలు చేసేలా ఉందని కామెంట్
హైదరాబాద్, వెలుగు: కేంద్రం ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ బిల్లు తేనే పూసిన కత్తిలాంటి చట్టమని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఇది రైతులను ముంచి కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తుందన్నారు. ఇలాంటి బిల్లుకు తాము మద్దతిచ్చేది లేదని స్పష్టం చేశారు. శనివారం టీఆర్ఎస్ రాజ్యసభ పార్లమెంటరీ నేత కేకేతో సీఎం ఫోన్ లో మట్లాడారు. రాజ్యసభలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయనకు సూచించారు. ‘‘ రైతులు పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో చెప్పారు. కొంచెం పంటను రవాణా ఖర్చులు భరించి వేరే ఎక్కడో అమ్మటం రైతులకు సాధ్యమేనా ? నిజానికి ఇది వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి కొనేందుకు ఉపయోగపడుతుంది. దీంతో కార్పొరేట్ గద్దలు దేశమంతా విస్తరిస్తారు. ఇది తేనె పూసిన కత్తి లాంటి చట్టం. దీన్ని కచ్చితంగా వ్యతిరేకించి తీరాలి’’ అని సీఎం అన్నారు. మక్కలపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి తగ్గించటాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. దేశంలో పుష్కలంగా మక్క పంట ఉండగా ఎవరీ ప్రయోజనం కోసం 35 శాతం సుంకం తగ్గించారని, మరీ మన రైతుల పరిస్థితి ఏమిటని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.
For More News..