మాలల సంక్షేమానికి కృషి చేసే పార్టీకే ఓటు: ​పిల్లి సుధాకర్​

కోల్​బెల్ట్, వెలుగు : మాలల సంక్షేమానికి కృషిచేసే పార్టీకే ఓటు వేయాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్​ పిలుపునిచ్చారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరింత అభివృద్ధి చెందేందుకు సమష్టి కృషి అవసరమని ఆయన పేర్కొన్నారు. ఆదివారం మందమర్రిలోని సింగరేణి సీఈఆర్​క్లబ్​లో నిర్వహించిన మాలమహానాడు సభలో ఆయన మాట్లాడారు.

తుంగతుర్తిలో మాల కులస్తుడు అద్దంకి దయాకర్​కు కాంగ్రెస్​ టికెట్​ ఇవ్వాలని డిమాండ్​చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశం పక్కన పెట్టి ఉమ్మడి రిజర్వేషన్ల పెంపు కోసం దళితులు ఐక్యం కావాలని సూచించారు. ఓటు చైతన్యంతో అంబేద్కర్  ఆశయాలను కొనసాగించాలన్నారు. అంతకుముందు బీఆర్​ అంబేద్కర్, మాల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పీవీ రావు ఫొటోలకు ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.