హైదరాబాద్ జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకోనున్న 571 మంది ఓటర్లు
హైదరాబాద్లో 129, సికింద్రాబాద్‌లో 385, కంటోన్మెంట్లో 57 మంది ఓటర్లు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లో శుక్రవారం(మే3) నుంచి ఓట్ఫ్రమ్హోమ్ స్టార్ట్‌కానుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాలతోపాటు, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం పరిధిలో 80 ఏండ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, ఎసెన్షియల్ సర్వీసెస్‌కు చెందినవారు 571 మంది ఉండగా, వీరంతా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో హైదరాబాద్ లో 129 మంది, సికింద్రాబాద్ లో 385 మంది, కంటోన్మెంట్లో 57 మంది ఉన్నారు. హోమ్ఓటింగ్ కోసం మొత్తం 40 టీమ్స్ ను అధికారులు రెడీ చేశారు. హైదరాబాద్ లో 10, సికింద్రాబాద్‌లో 27, కంటోన్మెంట్లో 3 టీమ్స్ఇంటింటికి తిరిగి ఓటు వేయించనున్నాయి. ఈ నెల 6 తేదీ వరకు ఓట్ ఫ్రమ్ హోమ్ కార్యక్రమం కొనసాగుతుంది.
అప్లికేషన్లు వెయ్యి కూడా దాటలే
హైదరాబాద్ జిల్లాలో 80 ఏండ్లకు పైబడినవారు మొత్తం 79,507 మంది ఉన్నారు. వీరిలో హైదరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో 33,641 మంది, సికింద్రాబాద్ లో 39,350 మంది, కంటోన్మెంట్ లో 6,516 మంది ఉన్నారు. అయితే ఓట్ ఫ్రమ్ హోమ్ కోసం దరఖాస్తు చేసుకున్నది మాత్రం 629 మంది మాత్రమే. సికింద్రాబాద్పరిధిలో 342 అప్లికేషన్లు రాగా ఈసీ 336ను ఆమోదించింది. హైదరాబాద్ లో 92 అప్లికేషన్లు రాగా 86ను, కంటోన్మెంట్లో 57 అప్లికేషన్లు రాగా 57ను ఈసీ ఆమోదించింది. అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడంతోనే అప్లికేషన్లు తగ్గాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.