పోలైన ఓట్లలో పంచుకునేవెన్ని!

లోక్ సభ ఎన్నికల్లో చాలా సెగ్మెంట్లలో తీవ్ర పోటీ నెలకొంటుంది. దీనివల్ల గెలిచిన అభ్యర్థికి, ఓడినక్యాం డిడేట్​కి మధ్య ఓట్ల వాటాలో తేడా చాలా తక్కువ ఉంటుంది. ఇండియా లాంటి ఎన్నికల వ్యవస్థే ఉన్న కెనడా, యూకే వంటి దేశాల్లో ఈ వ్యత్యాసం ఎక్కువ. ఫస్ట్​–పాస్ట్​–ది–పోస్ట్​ (ఎఫ్ పీటీపీ) ఎలక్టోరల్ సిస్టమ్ లో ఒక సీటు కోసం ఇద్దరు క్యాం డిడేట్లు బరిలో ఉన్నప్పుడు మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం కన్నా ఒక్క ఓటు ఎక్కువ వస్తేనే గెలిచినట్లు . ఓడిన అభ్యర్థికి సహజంగానే 50 శాతం కన్నా ఒక్క ఓటు తక్కువ వస్తుంది. ఒక వేళ ముగ్గురు పోటీలో ఉంటే, ఆ ‘ముగ్గురూ ముగ్గురే ’ అన్నట్లు బలమైన నేతలే అయితే విజేతగా నిలవటానికి మొత్తం ఓట్లలో మూడో వంతు కన్నా ఒక్క ఓటైనా ఎక్కువ రావాలి. కానీ, మన దేశంలో ఇలాంటి పరిస్థితులు దాదాపు కనబడవు. ఒక్క లోక్ సభ సీటు కోసం పదుల సంఖ్యలో లీడర్లు రంగంలోకి దిగుతారు. ఇండియన్ పొలిటీషియన్లు చాలా మంది తక్కువ ఓట్​ షేర్ తోనే ఎలెక్ట్​ అవుతుంటారు .

గెలుపొక్కటే కాదు

‘తక్కువ ఓట్​ షేర్ తో గెలవటంలో తప్పేముంది?’ అనుకోవచ్చు. టెక్ని కల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తప్పేమీ లేదు. నిజమైన ప్రజాప్రతినిధి అనటానికి గెలుపు మాత్రమే కొలమానం కాకూడదు. ఓట్​ షేర్ ను , పాపులారిటీని పరిగణనలోకి తీసుకోవాలి. వాటిలోనూ తిరుగులేని ఆధిక్యం ప్రదర్శిస్తేనే అసలు సిసలు విజేతగా, ప్రజానేతగా నూరు శాతం ఒప్పుకోవచ్చు. మొత్తం ఓట్లలో సగంకన్నా ఒక్క ఓటైనా ఎక్కువ పొం దిన అభ్యర్ థి నైతికంగా ‘జనం మెచ్చిన నాయకుడు’గా జేజేలు పలికించు కోవచ్చు. జవాబుదారీ తనానికి కూడా దీన్నొక ప్రాతిపదికగా భావించొచ్చు. ఎలక్షన్ లో విక్టరీ సాధించిన వ్యక్తికి నియోజకవర్గం లోని మొత్తం ఓటర్లలో ఎంతమంది సపోర్ట్​ ఉందో ఓట్​ షేర్ ద్వారా తెలుస్తుంది. ‘ఎంత మంది బరిలో ఉన్నా సెంట్​ పర్సెంట్​ సక్సెస్ ఆ లీడర్ దే. మొత్తం ఓట్లలో ఆ నాయకుడికి సగం పక్కా ’ అనే రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పబ్లిక్ అభిమానం సంపాదించుకోవాలి.

50 ఏళ్లలో ఎన్నడూ ఎరగని పోటీ

లోక్ సభ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే గత ఐదు దశాబ్దాల్లో ‘మోస్ట్​ కాంపిటీటివ్ ఎలక్షన్స్’ గా 2009 ఎన్నికలు నిలిచాయి. ఆ ఎలక్షన్స్​లో విజయం సాధిం చిన అభ్యర్థుల సగటు ఓటు వాటా జస్ట్​ 44 శాతం. ఆ సంవత్సరం కాంగ్రెస్ నేతృత్వం లోనియూపీఏ రెం డోసారి అధికారాన్ని చేపట్టిం ది. ఎన్నికల్లో పోటీని అర్థం చేసుకోవటానికి మరో కొలమానం ‘మార్జిన్ ఆఫ్ విక్టరీ (ఎంఓవీ)’. ఒక సెగ్మెంట్​లో విన్నర్ కి, రన్నరప్ కి మధ్య వచ్చిన ఓట్ల తేడానే ఎంఓవీగా పరిగణిస్తారు. పోటీ తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు, పొలిటీషియన్లు మరిం త జాగ్రత్తగా ఉండటానికి మార్జిన్ ఆఫ్ విక్టరీ ఉపయోగపడుతుం ది. ఫలానానియోజకవర్గం తమ పార్టీకి సేఫ్ అనుకుంటే తప్పఅక్కడి ఎంపీ.. కేంద్రం తనకు ఇచ్చిన నిధులన్నింటినీ ఖర్చుచేయటానికి పెద్దగా ఇష్టపడట్లేదు. ఎంపీ ల్యాడ్స్​పై జరిగిన ఒక సర్వే లో ఈ విషయం తేలింది.

మందిని బట్టి మారుతున్న మార్జిన్

పోటీలో ఇద్దరే ఉన్నప్పుడు విన్నర్ కి 50 శాతం కన్నా ఒక ఓటు ఎక్కువ వస్తే రన్నరప్ కి 50 శాతం కన్నా ఒక ఓటు తక్కువ స్తుం ది. అప్పుడు ఎంఓవీ సున్నా అవుతుం ది. గెలిచిన వ్యక్తి కి 60 శాతం ఓట్లు వచ్చి, ఓడిన అభ్యర్ థికి 40 శాతం వస్తే మార్జిన్ ఆఫ్ విక్టరీ 20 శాతానికి పెరుగుతుం ది. ఒక సెగ్మెంట్​లో రెండు పార్టీలే బరిలో ఉంటే ఎంఓవీని డైరెక్ట్​గా విన్నింగ్ పర్సం టేజీ ద్వారా లెక్కించొచ్చు. ఇండియా వంటి దేశాల్లో మల్టిపుల్ క్యాం డిడేట్లు పోటీ చేస్తారు. కాబట్టి, గెలుపు శాతంతోపాటు ఎంఓవీ కూడా తక్కువగానే ఉంటుంది. మార్జిన్ ఆఫ్ విక్టరీ 10 శాతంగా ఉంటే లీడిం గ్ అభ్యర్ థి గెలుపు సులభం. ఓట్​ షేర్ చీలుతుంది.1962–2014లో యావరేజ్ ఎంఓవీ 15.7 శాతం. 1971 నుంచి 1989 వరకు ఇది కొంచెం ఎక్కువే నమోదవటం చెప్పుకోదగ్గ విషయం. 1989 నుంచి 2014 వరకు (2009 మినహా) మార్జిన్ ఆఫ్ విక్టరీ 10 శాతంపైనే ఉంది. కొన్ని సెగ్మెం ట్లో సుమారు 11శాతానికి చేరిం ది. డెమొక్రసీలో వ్యక్తు ల మధ్య, పార్టీల మధ్య ఆరోగ్యకర పోటీకి కూడా ఎంఓవీని ఒక సిగ్నల్ గా భావిం చొచ్చు.

యూకే, కెనడాల్లో ఇలా..

యునైటెడ్ కిం గ్ డమ్ (యూకే)లో 2010, 2015ఎన్నికల్లో కేవలం 35.4 శాతం నియోజకవర్గాల్లో నే మార్జిన్ ఆఫ్ విక్టరీ 10 శాతం కన్నా తక్కువ ఉంది.కెనడాలో ఈ సంఖ్య ఇండియాకి దగ్గరగా ఉంది. మన దేశంలో 2006, 2008, 2011ల్లో 55 శాతం సీట్లలో ఎంఓవీ 10 శాతం కన్నా తక్కువే నమోదైంది.

16.7 శాతం ఓట్ల వాటాతోనే విజయం

యూపీలోని షాజహాన్ పూర్ నియోజకవర్గం​లో 1967 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో 9 మందికి 5 శాతం కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. పీకే ఖన్నా విన్నర్ గా నిలిచారు. ఆయన సాధిం చిన ఓట్ల వాటా కేవలం 16.7 శాతం

శ్రీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7 శాతమే ఓటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా ఎన్నిక మరీ చిత్రమైంది. శ్రీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోక్‌ సభా స్థానానికి 2017లో ఉప ఎన్నిక జరగ్గా , కేవలం 7.14 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. మొత్తం ఓట్లు 2,61,862ఉండగా, పోలైనవి 89,881 ఓట్లు ! ఈ ఓట్లలో 48,555 (54.02%) నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కేండిడేట్‌ ఫరూఖ్‌ అబ్దుల్లాకి పడ్డా యి. ఆయన ప్రత్యర్థి గా పీడీపీకి చెందిన నజీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌ ఖాన్‌ కి 37,779 (42.03%) వచ్చాయి . దాంతో 10,776 ఓట్ల మెజారిటీతో ఫరూఖ్‌ అబ్దుల్లా గెలుపొందారు .